5 భాషల్లో కుంభ

5 భాషల్లో కుంభదర్శకుడు వి.సముద్ర నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కుంభ’. వి.సముద్ర ఫిలిం బ్యానర్‌పై రూపొందబోయే ఈ చిత్ర ప్రారంభోత్సవం ఫిలింనగర్‌ దైవ సన్నిధానంలో ఘనంగా జరిగింది.
హీరో విజరు రామ్‌పై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు డీఎస్‌ రావు క్లాప్‌ కొట్టగా, సముద్ర సతీమణి విజయలక్ష్మి కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు. తొలి సన్నివేశానికి చంద్రమహేష్‌, దేవి ప్రసాద్‌ గౌరవ దర్శత్వం వహించారు.
ఈ సందర్భంగా దర్శక, నిర్మాత వి.సముద్ర మాట్లాడుతూ, ‘బలమైన కథలను నమ్ముకుని కొత్త వాళ్లతో 5 సినిమాలు చేస్తున్నాను. అందులో ‘కుంభ’ చిత్రం ఒకటి. ఆరు భారతీయ భాషల్లో ఈ పాన్‌ ఇండియా సినిమాని తీస్తున్నాం. ఈ సినిమాతో పాటు ‘వరద రాజు గోవిందం’, ‘రామ జన్మభూమి’, ‘ఇండియా సీఈఓ’, ‘ప్రొడక్షన్‌ నెం 5′ వంటి సినిమాలను కూడా ఆరు భారతీయ భాషల్లో పాన్‌ ఇండియా సినిమాలుగా చేయబోతున్నాను. ఈసినిమాకి సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తాను’ అని అన్నార.
మ్యూజిక్‌ డైరెక్టర్‌ వరంగల్‌ శ్రీను మాట్లాడుతూ, ‘వి.సముద్ర చేసినవన్నీ హిట్‌ టైటిల్సే. ఆయన సినిమాలోని పాటలు సందర్భోచితంగా ఉంటాయి. ఈ సినిమాకు పని చేయడం నా అదష్టం’ అని అన్నారు.
‘గతంలో థియేటర్‌ ఆర్ట్స్‌లో అనుభవం ఉన్న నాకు ఈ సినిమాలో కథానాయకుడిగా అవకాశం ఇచ్చిన డైరెక్టర్‌ సముద్రకి నా ప్రత్యేక కతజ్ఞతలు. ఇందులో నా పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. సముద్ర సినిమాల్లో ప్రతి పాత్రకు ఎంత ప్రాముఖ్యత ఉంటుంది. అటువంటి ప్రాముఖ్యత ఉన్న పాత్రను చేయబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది’ అని హీరో విజయరామ్‌ చెప్పారు.
ఈ సినిమాతో సముద్ర వంటి గొప్ప వ్యక్తి పరిచయం అవ్వడం నా పూర్వజన సుకతం. ఈ చిత్రంలో ఒక ప్రత్యేకమైన పాత్రతో పరిచయం కాబోతున్నాను అని సూరజ్‌ ఆదిత్య సింగ్‌ చెప్పారు.
ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ ప్లే, సంగీతం: వరంగల్‌ శ్రీను, డీవోపి : శ్రీ వెంకట్‌, ఎడిటర్‌ :నందమూరి హరి, రచయిత, సహ దర్శకుడు : వెంకటేష్‌ చిక్కాల, ఆర్ట్‌ డైరెక్టర్‌ : విజరు కష్ణ, కొరియోగ్రఫీ : అజరు, స్నేహ, ఫైట్స్‌ : మల్లి.