అపరిష్కృత పనులను ప్రారంభించిన కుంభం 

నవతెలంగాణ-భువనగిరి : ఎన్నికల ముందు హడావుడిగా పనులు ప్రారంభించి పెండింగ్ పెట్టిన టవర్స్ పనికి రూ 4కోట్ల 50 లక్షల పెండింగ్ బిల్లులను ఇప్పించి భువనగిరి లోని మెయిన్ రోడ్ లో గల టవర్స్ కు 33 కెవి 11 కేవీ లైన్ల ను కలుపుతున్న పనులను  భువనగిరి శాసనసభ్యులు కుభం అనిల్ కుమార్ రెడ్డి  గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భువనగిరి పట్టణ ప్రధాన రహదారికి ఇరువైపులో ఉన్న టవర్స్ కు లైన్లో కలపడం వల్ల  పహాని నగర్ బంజారాహిల్స్ ఓంకార్ నగర్ తాతా నగర్ విద్యానగర్ లోని ప్రజలకు మేలు జరిగుతుందన్నారు. ఈ పనులను 45 రోజులలోపు పూర్తి చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. పట్టణంలో పెండింగ్లో ఉన్న అన్ని పనులను పూర్తి చేయడంతో పాటు నూతన పనులు చేసి పట్టణాన్ని సుందరీ కరణ చేయడమే తన ధ్వేయమన్నారు.  ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ సభ్యులు తగలపల్లి రవికుమార్, మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, మున్సిపల్ బాజీ చైర్మన్ బర్రె జహంగీర్ కౌన్సిలర్ ఈరపాక నరసింహ ,కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.