ప్రజలందరికీ సురక్షితమైన తాగునీరు అందించడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జలజీవన పథకం ద్వారా తాగునీటిలో క్లోరినేషనపై ఆదివారం నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్ వాడి కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న తాగునీటి ట్యాంక్ లో ఉన్న నీటిని పరీక్షలు నిర్వహించారు. మంచి నీటిలో కలుషితమైన సూక్ష్మజీవులను, క్లోరిన ను గుర్తించేందుకు జలజీవన పథకం ద్వారా పీఎచ ఏఫైర్ ల్యాబ్ టెక్నీషియన్లు వచ్చి పరీక్షలు నిర్వహిస్తున్నారని తాగునీటి అధికారిణి అశ్విని తెలిపారు. గ్రామంలో ఉన్న అన్ని వాటర్ ట్యాంకులు, మంచినీటి బోర్లను పరిశీలించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందుతోంది. ఇందులో భాగంగా కుళాయిల ద్వారా నీరు ఏసమయానికి నీరు వదులుతారు అన్న సమాచారాన్ని ల్యాబ్ టెక్నీషియన ప్రత్యక్షంగా ప్రజలను అడిగి తెలుసుకుని మొత్తం 12 శాంపిల్‌లను పరీక్షించారు. వాటిని ల్యాబ్‌కు పంపించి నీటిలో ఉన్న క్లోరిన శాతం ఏవిదంగా ఉంది నీటిలో ఏమైనా సూక్ష్మజీవులు కలిగి ఉన్నాయా అనే కోణంలో తెలుసుకుని వాటి ఆదా రంగా తగిన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.v వీరి వెంట డిప్యూటీ ఇంజనీర్ వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్, లక్ష్మి నారాయణ, శక్రు , కార్యదర్శి రాజేష్ కారోబర్ రతన్ కుమార్, సలీం, మెకానిక్, తదితరులు పాల్గొన్నారు.