
కుటుంబ కలహాలతో ఉరి వేసుకొని ఏఆర్ కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన మంగళవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ నర్సింగ్ వెంకన్న గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని ధర్మాపురం గ్రామానికి చెందిన అర్రురి సైదులు(41) సూర్యాపేటలో ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి పట్టణంలోని అంజనాపూరి కాలనీలో నివాసం వుంటుంన్నాడు. కాగా మంగళవారం రాత్రి సుమారు ఒంటి గంట సమయంలో తన తండ్రి ఆర్రురి జానకిరాములుకు ఫోన్ చేసి, నా కుటుంబ కలహాల వలన బావి వద్ద ఉరి వేసుకుని చనిపోతున్నానని చెప్పి ఫోన్ కట్ చేసినట్లు, మళ్ళీ ఫోన్ సమాధానం ఇవ్వకపోవడంతో సలిగంటి విజయ్ కుమార్ తో కలిసి బావి వద్దకు సుమారు 3 గంటలకు వెళ్ళగా, వేప చెట్టుకు ఊరి వేసుకొని చనిపోయి ఉన్నాడని, బ్రతికి ఉన్నాడేమో అనుకొని క్రిందికి దించి చూడగా చనిపోయి ఉన్నాడని నిర్ధారించుకున్నట్లు తెలిపారు. కాగా మృతుడి తండ్రి జానకిరాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. కాగా మృతుడికి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న కుమార్తె, బీటెక్ సెకండియర్ చదువుతున్న కుమారుడు ఉన్నారు.