బీజేపీ మండల అధ్యక్షునిగా అర్. సురేష్ నాయక్..

నవతెలంగాణ – మాక్లూర్
మండల కేంద్రంలోని దుర్గనగర్ తండాకు చెందిన రమావత్ సురేష్ నాయక్ ను మండల అధ్యక్షునిగా సోమవారం నియమించారు. సురేష్ నాయక్ గతంలో ఏబీవీపీ విద్యారి నాయకునిగా బాధ్యతలు నిర్వహించారు. అలాగే బీజేపీ మండల కార్యదర్శిగా, మండల ఉపాధ్యక్షునిగా బీజేపీ గిరిజన మోర్చా జిల్ల కార్యదర్శి గా పార్టీలో పనిచేయడం జరిగింది. బీజేపీ మాక్లూర్ మండల అధ్యక్షునిగా తనాపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పచెపిన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ కు,  రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగన్నకు, జిల్లా అధ్యక్షులు భాస్వ లక్ష్మి నర్సయ్యకు, ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ అల్జాపూర్ శ్రీనివాస్ కు, ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు రాకేష్ రెడ్డి, కంచేటి గంగాధర్, విజయ భారతి, పాలేపు రాజు లకు ధన్యవాదాలు తెలిపారు.