అరవింద్ ఐదు సంవత్సరాలు గాడిదలు కాసాడ: మానాల మోహన్ రెడ్డి 

– అరవింద్ పై తీవ్రంగా మండిపడ్డ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి 
నవతెలంగాణ – కంటేశ్వర్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పై ఎంపీ అరవింద్ అహంకారంతో చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మంగళవారం కాంగ్రెస్ భవన్ నందు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి,పీసీసీ ఉపాధ్యక్షులు తహెర్ బిన్ హందన్, పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్,మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత,నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వెనులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్, బిఅర్ఎస్ ఒకటేనని, అరవింద్ కు వ్యతిరేకంగా బీజేపీ నాయకులు చేస్తున్న పనుల వెనుక కాంగ్రెస్ నాయకులు వున్నారని ఎంపీ అరవింద్ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, కానీ బీజేపీ బీఆర్ఎస్ కలిసే ఉన్నాయని, అది జిల్లా ప్రజలందరికి తెలుసని ఆయన అన్నారు. అరవింద్ యొక్క అహంకారం జిల్లా ప్రజలకు తెలుసని, అసమర్థుడు, సన్యాసి అయిన అరవిందును ఎంపీగా గెలిపించడం వల్ల ఏమీ అభివృద్ధి జరగలేదు. అలాంటి వ్యక్తిని మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించుకొని ఐదు సంవత్సరాలు అసమర్ధుడి చేతిలో నియోజకవర్గాన్ని పెట్టడం ఇష్టం లేక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల ప్రజలు చెంప ఛెళ్లుమనిపించేలా అక్కడి నుండి అరవింద్ ను తరిమేశారని, అరవిందుపై మానాల మోహన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. మళ్లీ అసమర్ధ అరవింద్ ఎంపీ కావడం ఇష్టం లేని బీజేపీ కార్యకర్తలే అరవింద్ కు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తూ, కరపత్రాలు పంచుతున్నారని మానాల మోహన్ రెడ్డి తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు 45 సంవత్సరాలుగా రాజకీయాలలో ఉంటూ ఎటువంటి మచ్చలేని నాయకుడని, కేవలం ప్రజల క్షేమమే ప్రజల అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తారని, స్వార్ధ రాజకీయాలు గాని, ఇతరులను దూషించే రాజకీయాలు జీవన్ రెడ్డి గారికి తెలియవని మానాల మోహన్ రెడ్డి అన్నారు. అరవింద్ లాగా నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి కేవలం ప్రెస్ మీట్ లకే పరిమితమవుతూ, పబ్బుల్లో కాలాన్ని గడిపే వ్యక్తి జీవన్ రెడ్డి కాదని, ఆయన ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడని, బీజేపీ నాయకులు గమనించాలని ఆయన తెలియజేశారు. యువకులు అరవిందద్ చెప్పిన తప్పుడు మాటలు నమ్మి తన వెంట ఉండి ఇప్పుడు అరవింద్ యొక్క నిజస్వరూపం తెలిసి తప్పుడు ఆలోచనలు అర్థమై కోరుట్లలో ఒక యువకుడు కిరోసిన్ పోసుకున్నాడని ఇది అరవింద్ యొక్క అజ్ఞానానికి నిదర్శనం అని మానాల మోహన్ రెడ్డి అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని గతంలో కవితకు పట్టిన గతే ఇప్పుడు అరవింద్ కు కూడా పడుతుందని,జిల్లా ప్రజలు కర్రు కాల్చి అరవింద వాత పెట్టే విధంగా మూడో స్థానానికే పరిమితం చేస్తారని ఆయన అన్నారు. ఎన్నికల్లో పసుపు బోర్డు పసుపు మద్దతు ధర తేస్తానని బాండ్ పేపర్ రాసి ఇచ్చి, బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని చెప్పి ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడ గాడిదలు కాశావో ప్రజలకు చెప్పాలని మానాల మోహన్ రెడ్డి విమర్శించారు. బాండ్ పేపర్లు రాసి ఇచ్చిన విధంగా పసుపు బోర్డు పసుపు మద్దతు ధర తీసుకురాకుండా ,షుగర్ ఫ్యాక్టరీని తెరిపించకుండా తప్పుడు మాటలతో అబద్ధపు హామీలతో ఐదు సంవత్సరాలు కాలం గడిపిన ఎంపీ అరవింద్ కు ప్రజలు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్తారని, అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల నియోజకవర్గంలో అరవింద్ కు జరిగిన పరాజయమే మళ్లీ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో జరుగుతుందని, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఎంపీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ నాయకులు ఎల్లప్పుడూ పనిచేస్తారని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని మానాల మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంతిరెడ్డి రాజారెడ్డి,సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్,జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్,యువజన కాంగ్రెస్ నాయకులు సుమన్,నగర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శివ,బింగి మధు సుధన్,నర్సింగ్,గంగారెడ్డి,రాజు తదితరులు పాల్గొన్నారు.