పల్లె దావఖానాను సందర్శించిన అరవిందు ఫణగారియ..

Aravindu Phanagariya visited the village Davakhana afterwards..నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి మండలంలోని అనంతారం గ్రామంలో గల పల్లె దవాఖానా ను మంగళవారం 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియ, కమిషన్ సభ్యులు అజయ్ నారాయణ్ లు సందర్శించారు. గ్రామాలలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. గ్రామీణ ప్రాంతంలో నివసించే ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందా లేద అని జిల్లా అధికారులను అడిగిన అనంతరం  జిల్లా అధికారులు తెలిపిన విషయాలను గ్రామస్తులతో మాట్లాడి క్షేత్రస్థాయిలో వైద్య సేవల ను అడిగి తెలుసుకున్నారు. గ్రామ పరిపాలన అభివృద్ధికి సంబంధించిన విషయాలను అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి క్రిస్టినా చోంగ్తూ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్ వి కర్ణన్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అనిత రామచంద్రన్,  ిల్లా కలెక్టర్ హనుమంతు కే జండగే, ఇన్చార్జి డిఎంహెచ్వో డాక్టర్ యశోద, ఎడి పిహెచ్‌ఓ డాక్టర్ మనోహర్, ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ యామిని శృతి, డాక్టర్ మురళి వసుధ సురేష్ కుమార్ రమాదేవి పాల్గొన్నారు.