యథేచ్ఛగా అక్రమ ఇసుక జీరో దందా.?

యథేచ్ఛగా అక్రమ ఇసుక జీరో దందా.?– నవ తెలంగాణ కథనంతో అధికారుల్లో కదలిక
– అర్ధరాత్రి కాటారం పోలీసులు దాడులు
– ఆరు ఇసుక లారీలు సీజ్ కేసులు నమోదు.
– నాలుగు డంపింగ్ చేసి పరార్
నవ తెలంగాణ మల్హర్ రావు.
ప్రభుత్వం ఎంత కట్టడి చేసిన అక్రమ జీరో ఇసుక దందా మల్హర్,కాటారం మండలాల్లో యథేచ్ఛగా కొనసాగుతోంది.ఈ అక్రమ జీరో ఇసుక దందాపై నవ తెలంగాణ వరంగల్ ఎడిషన్ దినపత్రికలో ఇటీవల ,,మానేరులో ఇసుక దొంగలు,, అనే కథనానికి అధికారుల్లో ఆలస్యంగా కదలికలు వచ్చాయి.అక్రమ ఇసుక దందాపై కాటారం డిఎస్పీ రామ్మోహన్ రెడ్డి, సీఐ నాగార్జున రావు ఆధ్వర్యంలో శనివారం అర్ధరాత్రి విస్తృతంగా దాడులు నిర్వహించారు. మండలంలోని కొయ్యుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు లారీలు, కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు లారీలు, మొత్తం ఆరు అక్రమ జీరో ఇసుక రవాణా చేస్తున్న ఇసుక లారీలను సీజ్ చేసి,కాటారం,కొయ్యుర్ పోలీస్ స్టేషన్ లకు తరలించారు.లారీలపై విచారణ చేపట్టి, డ్రైవర్లు, ఓనర్ లపై కేసులు నమోదు చేశారు. కొందరు లారీల డ్రైవర్లు తాడిచెర్ల.. మల్లారం ప్రధాన రొడ్డుపై డంపింగ్ చేసిన నాలుగు లారీల పరార్ అయ్యాయి. ఈ కుప్పలను మండల తహశీల్దార్ కు అప్పజెప్పినట్లుగా కొయ్యుర్ ఎస్ఐ నరేశ్ తెలిపారు.
చెక్ పోస్టు ముందు నుంచే ఇసుక దందా….
విలాసాగర్,గంగారం గ్రామాల్లో అక్రమంగా ఇసుక డంపులు పోసి రాత్రి వేళల్లో గంగారం ఎక్స్ రొడ్డపై టిఎస్ ఎండిసి చెక్ పోస్ట్, విలాసాగర్ లో ఉన్న సిసి కెమెరాలు తొలగించి అక్రమంగా జీరో ఇసుకను తరలిస్తూ ఇసుక వ్యాపారులు పైలెట్ ద్వారా ముందుగానే సమాచారం తెలుసుకొని లారీలను తరలిస్తున్న విషయం తెలిసిందే. ఇసుక రిచ్ ల లారీలతో కలిసి జీరో ఇసుక దందాను యధేచ్చగా సాగిస్తున్నట్టుగా తెలుస్తోంది.
వేబిల్లులు లేకుండా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవు. కాటారం డిఎస్పీ రామ్మోహన్ రెడ్డి
కాటారం,మల్హర్ మండలాల్లో వేబిల్లులు లేకుండా జీరో ఇసుకను తరలిస్తే ఎంతటివారైనా చర్యలు తప్పవు.కేసులు నమోదు చేస్తూ, లారీలు సీజ్ చేస్తాం