– కబ్జాలకు పాల్పడుతున్న వైనం
– మండలంలోని శివారుల్లో దాదాపు వందల ఎకరాలకు పైగా అటవీ భూమి కబ్జాకు యత్నం
– అడవిలో చెట్లను నరికేసిన కబ్జాదారులు
– మండలంలోని శివారుల్లో దాదాపు వందల ఎకరాలకు పైగా అటవీ భూమి కబ్జాకు యత్నం
– అడవిలో చెట్లను నరికేసిన కబ్జాదారులు
– ఫారెస్ట్ అధికారులు దాడులు చేస్తున్నా ఆగని ఆక్రమణలు0
– మండలంలో కనుమరుగవుతున్న అడవులు
నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
పెద్దకొడప్ గల్ మండలంలోని అటవీ భూములు దున్నుతున్న జెసిబి ట్రాక్టర్లు ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. ఫారెస్ట్ అధికారి సంజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పెద్దకొడప్ గల్ మండలంలోని పలు గ్రామాల్లో అధిక డబ్బులు తీసుకొని ట్రాక్టర్ జెసిబి లతో ఫారెస్ట్ భూములు దున్నుతున్నారని స్థానికులు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకోగా సంఘటనా స్థలంలో ఒక జెసిబి ఒక ట్రాక్టర్ దున్నుతున్న సమయంలో దొరికాయని అటవీ భూమి అయిన 464 సర్వే నెంబర్లు దున్నకాలు జరగడంతో సమాచారం తెలుసుకొని సంఘటన స్థలానికి చేరుకున్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని అటవీ భూముల ఆక్రమణదారులు, స్మగ్లర్ల గొడ్డలి వేటుకు అడవులు కనుమరుగవుతున్నాయి.భవిష్యత్తు తరాలకు అడవులను మిగిల్చకుండా భూ ఆక్రమణదారులు అడవులను యథేచ్ఛగా కబ్జాలు చేస్తున్నారు. పంటల సాగు పేరిట ప్రకృతి సంపదైన అటవీ భూములను కొల్లగొడుతున్నారు. దీంతో జిల్లాలో రోజురోజుకూ అడవులు కనుమరుగవుతన్నాయి. ప్రస్తుతం 22 శాతం మాత్రమే అడవులు ఉన్నాయని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. అటవీ భూములు ఆక్రమణకు గురికాకుండా అటవీశాఖ దాడులు చేస్తున్నా ఆక్రమణకు గురవుతునే ఉన్నాయి. మండలంలో ఇప్పటి వరకు వందల ఎకరాలకు పైగా అటవీ భూములు కబ్జాలు అయినట్లు ఆ శాఖ అధికారుల రికార్డులు చెబుతున్నాయి.ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఆక్రమణ దారులు అటవీ భూములపై పడినట్లు తెలుస్తోంది. ఇదే అదనుగా భావించి అటవీ భూములను ఆక్రమించుకునేందుకు ఆక్రమణదారులు ప్రయత్నాలు చేపడుతుండడం మండలంలో జరుగుతున్న సంఘటనలే నిదర్శనం.ఇటీవల కాలంలో మండలాల్లో సుమారు 50 ఎకరాలకు పైగా అటవీ భూములను ఆక్రమించినట్లు అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు.