
మంగళవారం ఒలింపిక్ అధ్యక్షులు, అర్చరీ ఫెడరేషన్ ఉపాధ్యక్షులుగా ఎన్నికైన ఈగ సంజీవ రెడ్డిని సంజీవరెడ్డి స్వగృహములో సీనియర్ కాంగ్రెస్ నాయకులు తాహెర్ బిన్ అహ్మ్మద్ శాలువా తో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా తాహెర్ మాట్లాడుతూ తన చిన్నా నాటి మిత్రుడు, మృదుశాలి అయిన సంజీవ రెడ్డి జిల్లా నుండి ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో స్థానం లభించడం జిల్లాకే గర్వకారణమని అన్నారు. మున్మందు మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమం లో సెపక్ తక్రా జిల్లా కార్యదర్శి గాధరి సంజీవ్ రెడ్డి, సీనియర్ అత్లెట్ మార్టిన్ పాల్గొన్నారు.