నవతెలంగాణ -వలిగొండ రూరల్: మండల పరిధిలోని పహిల్వాన్ పూర్ గ్రామానికి చెందిన బండారు సాయమ్మ సోమవారం రాత్రి అకాల మరణం చెందారు. వారి కుటుంబ సభ్యులను మంగళవారం ఏజేఆర్ ఫౌండేషన్ అధినేత ఎలిమినేటి జంగారెడ్డి పరామర్శించి ఏజేఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో కుటుంబానికి 10,000 వేల రూపాయలు ఆర్ధిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏజెఆర్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.