సీఎం మాటలు నీటి మూటలేనా..

–  ప్రతి ఇంటికి మిషన్ భగీరథ మంచినీళ్లు అందించడం ఉష్కాకేనా

– నీటి ట్యాంకులకు కలర్ మార్చి కొత్తగా చేశారు, ప్రజలకు వచ్చే త్రాగే నీళ్లు మాత్రం పాత ఫ్లోరైడ్ నీళ్లు
– భగీరథ నీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడగనంటూ ఇది రెండవసారి జరుగుతున్న ఎన్నికలు మీ హామీ ఏమైంది సారు
– మండల  ప్రజల్లో ముఖ్యమంత్రి హామీపై జోరుగా వినబడుతున్న చర్చలు
– ఇంటింటా మంచినీళ్లు అందిస్తున్నామని ఈ ఎన్నికల్లో జరుగుతున్న ముఖ్యమంత్రి ప్రచారాలపై మద్నూర్ మండలంలో భగీరథ నీళ్లు ఎక్కడ సారు అంటూ మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు,
నవతెలంగాణ – మద్నూర్
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాష్ట్ర ప్రజలకు ఇచ్చే హామీలు నీటి మూటలుగానే ఉన్నాయి అనటానికి మద్నూర్ మండలంలో ఏళ్ల తరబడి సంవత్సరాల కాలంగా మిషన్ భగీరథ నీళ్లు కానరాని పరిస్థితి నిదర్శనంగా చెప్పుకోవచ్చు గడిచిన ఐదు సంవత్సరాల క్రితం ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు అందించకపోతే ఓట్లు అడగమని గొప్పలు పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్ నీవు ఇచ్చిన హామీ జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండలంలో మిషన్ భగీరథ నీళ్లు కరువయ్యాయి. మండల కేంద్రంలోనే మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదంటే ఇక పల్లెటూరు గ్రామాల్లో ఈ పరిస్థితి ఎలా ఉందో ప్రభుత్వం అర్థం చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథ మంచినీళ్ల కోసం వందల వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి ఇంటింటా మంచినీళ్ల పథకం ప్రవేశపెట్టినప్పటికీ దాదాపు రెండు పర్యాయాలు ముఖ్య మంత్రి అధికారంలో కొనసాగిన మిషన్ భగీరథ నీళ్లు రాలేదు మళ్లీ ఎన్నికలు వచ్చాయి ఇంటింటాకు మంచినీళ్లు అందిస్తున్నామని ప్రచారాలు మాత్రం గొప్పగా చెప్పుకుంటున్నారు. మద్నూర్ మండలంలో మిషన్ భగీరథ నీళ్లు ఎక్కడ రాని పరిస్థితి వందల వేల కోట్లు ఖర్చులు చేసి ఏళ్ల తరబడి మంచినీళ్లు రాకపోతే ప్రచారాలు ఎందుకు సారు అంటున్నారు. మండల ప్రజలు ఈ పథకం ద్వారా ప్రతి గ్రామంలో వేలకోట్ల రూపాయల సిసి రోడ్లు పాడయ్యాయి ఇంటింటా కుళాయిలు బిగించారు. ఆ కుళాయిలు మూగబోతున్నాయి నీళ్లు లేవు వాటికి తుట్టీలు  లేవు గ్రామ గ్రామాన మిషన్ భగీరథ మంచినీటి కోసం ప్రజలు ఎదురుచూస్తున్న నీటి ట్యాంకులకు కలర్లతో కొత్తగా మార్చారు. కానీ ప్రజలకు వచ్చేవి పాత బోర్ల నుండి ఫ్లోరైడ్ నీళ్లు మాత్రమే త్రాగవలసిన పరిస్థితి అయ్యా ముఖ్యమంత్రి వందల వేల కోట్ల రూపాయలు ఖర్చులు చేసి మంచినీటి పథకం అమలు కాకపోతున్నప్పటికీ ప్రభుత్వ పనితీరు అధ్యాయానం ఎక్కడ సారు ప్రతి ఎన్నికల్లో ప్రచారానికే మిషన్ భగీరథ పథకం వాడుకుంటున్నార. అనటానికి మద్నూర్ మండలంలో మిషన్ భగీరథ నీళ్లు ఇంటింటా అందకపోవడమే మీ ప్రచారానికి అర్థం పడుతుంది అంటున్నారు ప్రజలు కలర్ మార్చగానే మంచి నీళ్లు వస్తున్నట్లేనా మీ ప్రభుత్వంలో గల ఎమ్మెల్యేలు ఎక్కడైనా మిషన్ భగీరథ నీళ్లు ఏ ఊర్లోనైనా పరిశీలన జరిపారా అనే చర్చలు మండల ప్రజల్లో జోరుగా వినిపిస్తున్నాయి మళ్లీ ఎన్నికలు వచ్చాయి మళ్లీ మిషన్ భగీరథ పథకమే ప్రచారాస్త్రంగా వాడుకుంటున్నారు నీళ్లు మాత్రం పుష్కాకే ఎక్కడ మంచి నీటి మిషన్ భగీరథ పథకం నీళ్లు రావడంలేక డబ్బా నీళ్లు కొనుక్కొని తాగవలసిన దుస్థితి ఫ్లోరైడ్ నీళ్లు తాగలేరు ఫ్లోరైడ్ రైత నీళ్ళు అందించడానికి మిషన్ భగీరథ పథకం అమల్లోకి తెచ్చారు ఆ పథకం నీటి ట్యాంకుల కలర్ మారింది కానీ కుళాయిల ద్వారా చుక్క నీరు వచ్చిన దాఖలాలు కనిపించడం లేదు అయ్యా ముఖ్యమంత్రి గారు మిషన్ భగీరథ నీళ్లు ఇప్పించండి ఓట్లు అడగండి నీళ్లు రాక మునుపే ప్రజలకు ఓట్లు అడగడం ఇది రెండోసారి ఇప్పటికైనా నీటి ట్యాంకులకు కలర్ మార్చినట్లు  కాదు కుళాయిల ద్వారా మిషన్ భగీరథ మంచినీళ్లు వచ్చే విధంగా చూడండి ఓట్లు అడగండి అంటు మండల ప్రజల్లో ఆవేదన వ్యక్తం అవుతుంది ఏళ్ల తరబడి మిషన్ భగీరథ నీళ్లు అందకపోయినా అధికారులు మాత్రం మిషన్ భగీరథ నీళ్లు ఊరు ఊరుకు కనెక్షన్ ఇచ్చామంటూ చెబుతున్నారు. కానీ ఊరురా మిషన్ భగీరథ నీళ్లు రాలేకపోవడానికి కారణం జీపీలదే బాధ్యత అని అధికారులు చెప్పుకొస్తున్నారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పనులు సంపూర్ణంగా పూర్తి చేసి నీళ్లు వస్తున్నాయి అనటానికి ప్రతి గ్రామపంచాయతీ నుండి అధికారికంగా నివేదికలు తీసుకోవడం జరిగిందని అధికారుల వాదన ఎవరి వాదన ఎలా ఉన్నా ఇంటింటా మంచినీళ్లు వస్తున్నాయా లేదా అధికారులు కన్నెత్తి చూడకపోవడం ఇంటింటా ఫ్లోరైడ్ నీళ్లు మాత్రమే త్రాగవలసిన దుస్థితి ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ మంచినీటి పథకం ఎక్కడ అమలు కావడం లేదు అనడానికి మద్నూర్ మండల కేంద్రమే నిదర్శనంగా చెప్పవచ్చు ఇప్పటికైనా ముఖ్యమంత్రి మిషన్ భగీరథ పథకంపై ఏ విధంగా నిర్లక్ష్యం ఉందో మంచినీటి పథకం అమలు కాకపోవడం కారణాలు ఏమిటో సమగ్రమైన విచారణ చేపట్టి నిర్లక్ష్యం చేసే అధికారులపై చర్యలు తీసుకొని ప్రజలకు మిషన్ భగీరథ మంచి నీటిని అందించాలని మండల ప్రజలు కోరుతున్నారు.