నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలో గల ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాశాఖ ఆదేశాలు అమలయ్యేనా అంటున్నారు మండల ప్రజలు రాష్ట్ర విద్యాశాఖ ప్రైవేట్ పాఠశాలల్లో విద్యకు సంబంధించిన పుస్తకాలు అమ్మకాలుగాని విద్యార్థిని విద్యార్థులకు యూనిఫార్మ్స్ గాని ఇతరత్రా స్టేషనరీ వాటిని నిషేధించింది. ప్రవేట్ పాఠశాలలో పుస్తకాలు గానీ యూనిఫామ్స్ గాని స్టేషనరీ కి సంబంధించిన ఎలాంటి వస్తువులైన అమ్మకాలు జరపకూడదని ఇటీవల కామారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి రాజు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నెల 12న పాఠశాలలు ప్రారంభం కానున్నాయి ప్రైవేట్ పాఠశాలల్లో నిర్వాహకులు ప్రతి సంవత్సరం పాఠ్యపుస్తకాలు యూనిఫామ్స్ స్టేషనరీ రకరకాల వస్తువులు అందజేస్తూ వేలాది రూపాయలు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వస్తువులు చేయడం అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ ఏడాది విద్యాశాఖ పకడ్బందీ చర్యలు తీసుకునేందుకు ప్రైవేట్ పాఠశాలల యజమానులకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేస్తుంది. ఎక్కడైనా ఏ పాఠశాలనైనా యూనిఫార్మ్స్ గాని, పుస్తకాలు గాని, స్టేషనరీ వస్తువులు గాని, అమ్మినట్లు ఫిర్యాదులు వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కానీ ఆదేశాల ప్రకారం ప్రైవేట్ పాఠశాలల పట్ల రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేకంగా దృష్టి సాధించవలసిన అవసరం ఎంతైనా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రభుత్వాలు మారినా ఎలాంటి ఆదేశాలు జారీ చేసినా ప్రైవేట్ పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా చదువులు వ్యాపారంగా కొనసాగిస్తూ అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తూ యూనిఫామ్ పేరుతో, పాఠ్యపుస్తకాల పేరుతో, ఎన్నో రకాల మోసాలు చేస్తూ వస్తున్నారు. ఈ ఏడాది విద్యాశాఖ హెచ్చరికలు జారీచేసిన వాటిని ప్రైవేట్ పాఠశాలల యజమానులు కట్టుబడి పని చేస్తాయా విద్యాశాఖ ఆదేశాలను బేకాతర్ చేస్తాయా పాఠశాలలు ప్రారంభమైన తర్వాత తెలుస్తోంది. ఎందుకంటే ప్రైవేట్ పాఠశాల యజమానులు అధిక ఫీజులు వసూలు చేయడం ఒకటి అయితే వారికి అధిక లాభాలు వచ్చే యూనిఫార్మ్స్ పాఠ్యపుస్తకాలు టై స్టేషనరీ వీటిని అమ్మ లేకపోతే పాఠశాలలు నడపలేని స్థితికి వస్తాయి ప్రైవేట్ పాఠశాలల్లో ఎలాంటి వ్యాపారాలు కొనసాగకుండా రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.