సమాజ హితం కోరే ఏ కార్యక్రమాని కైనా తన వంతు సహకారం అందిం చేందుకు ఎప్పుడూ ముందుంటారు హీరో ప్రభాస్. తెలంగాణ ప్రభు త్వం చేపట్టిన యాంటీ డ్రగ్ అవేర్ నెస్ కార్యక్రమానికి ప్రభాస్ మద్ధతు ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేస్తూ డ్రగ్స్ వద్దు అనే సందేశాన్ని వీడియో రూపంలో అందించారు. ‘లైఫ్ లో మనకు బోలెడన్ని ఎంజారుమెంట్స్ ఉన్నాయి. కావాల్సి నంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనషులు, మన కోసం బతికే మన వాళ్లు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్?, డ్రగ్స్‌ను ఈ రోజు నుంచే వదిలేయండి. మీకు తెలిసిన ఎవరైనా డ్రగ్స్‌కు బానిసలు అయితే టోల్ ఫ్రీ నెంబర్ 8712671111కు కాల్ చేయండి. వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది’ అని వీడియోలో ప్రభాస్ సందేశమిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాలకు సినీ తారలు సైతం ప్రచారం కల్పించాలని ఇటీవల జరిగిన భేటీలో సినీ ప్రముఖులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరిన విషయం తెలిసిందే. దీనికి స్పందిస్తూ యాంటీ డ్రగ్ అవేర్‌నెస్ కార్యక్రమ ప్రచారానికి హీరో ప్రభాస్ తొలి అడుగు వేశారు. ‘కల్కీ’ సినిమాతో గతేడాది రూ.1100 కోట్ల గ్రాస్‌ని కలెక్ట్ చేసి, హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకస్థానాన్ని సొంతం చేసుకున్న ప్రభాస్ త్వరలోనే ‘రాజాసాబ్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.