మొలకల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని రెగ్యులర్‌గా మీ డైట్‌లో యాడ్ చేస్తే కేలరీస్ తక్కువగా తీసుకుంటారు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో జీర్ణశక్తి సరిగ్గా జరుగుతుంది. అయితే, వీటిని ఎప్పుడు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకోండి.
ఏ టైమ్‌లో తీసుకుంటే మంచిది..
వీటిని బ్రేక్‌ఫాస్ట్ నుంచి మధ్యాహ్నం టైమ్‌లో తీసుకోవడం మంచిది. ఎందుకంటే, వీటిని తినడం వల్ల బాడీకి ఎనర్జీ అందుతుంది. రోజంతా మీ పనులని మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. నీరసం ఉండదు.
రాత్రుళ్ళు తింటే..
కొంతమంది మొలకల్ని రాత్రుళ్ళు డిన్నర్ టైమ్‌లో తీసుకోవాలనుకుంటారు. కానీ, ఇది అస్సలు మంచిది కాదు. దీని వల్ల జీర్ణ సమస్యలొస్తాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్ పట్టేసినట్లుగా ఉంటుంది. దీంతో మీ నిద్ర డిస్టర్బ్ అవుతుంది. సాధారణంగా మొలకల్లో రిచ్ న్యూట్రియెంట్స్ ఉంటాయి. వీటిని తినడం వల్ల రోజంతా ఎనర్జీగా ఉంటారు. అదే రాత్రుళ్ళు నిద్రపట్టదు. నిద్ర సరిగా లేకపోతే జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయదు. నిజానికీ మొలకలు తిన్నప్పుడు గ్యాస్ సమస్య ఉన్నప్పటికీ.. అది మీరు మోతాదులో తిన్నప్పుడు ఎప్పుడు మరీ అంతలా ఇబ్బంది పెట్టదు. అదే విధంగా.. ఉదయాన్నే తినప్పుడు ఎనర్జీగా ఉంటారు. పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు కాల్షియం, పొటాషియం, ఫోలేట్, మెగ్నీషియంలు ఉంటాయి. కాబట్టి, బ్రేక్‌ఫాస్ట్‌లో యాడ్ చేస్తే మీరు ఎనర్జీగా ఉంటారు.