రవి అనే బాలుడు తరగతిలో బాగా చదివేవాడు. కానీ, తరచుగా తోటి పిల్లల్ని ఎగతాళి చేస్తూ, వారిని బాధపెట్టేవాడు. రవి ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకునేందుకు ఉపాధ్యాయుడు రవిని నా దగ్గరకు తీసుకొని వచ్చారు.
రవితో మాట్లాడినప్పుడు ఏమీచెప్పకుండా మౌనంగా ఉండేవాడు. తన ఆటలు, ఇష్టాలు, చదువు గురించి అడిగితే నాకు ఏమి తెలియదు అనేవాడు. కొన్నిరోజులు వచ్చిన తర్వాత తాను ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇలా చెప్పాడు…
తల్లిదండ్రులు తరచుగా గొడవపడేవారని, ఇంట్లో ఆ ఒత్తిడిని తాను సహించలేక తోటి పిల్లలపై చూపిస్తానని చెప్పాడు. రవికి సాంత్వన ఇచ్చి, ఇతరులను గౌరవించడం ఎంత ముఖ్యమో వివరించి, కౌన్సెలింగ్ ద్వారా తన ప్రవర్తన మార్చుకొనేలా చేయడంతో తోటి విద్యార్థులందరితో స్నేహంగా ఉండడం మొదలుపెట్టాడు.
ఇంకో విద్యార్థి.. తనను టిచర్ బాగా కొడుతుందని తోటి విద్యార్థులను ఏడిపించేవాడు.
కారణాలు:
గమనింపబడాలనే కోరిక:
– కొంత మంది విద్యార్థులు తాము ప్రత్యేకంగా ఉండాలని భావించి, ఇతరులను ఏడిపించడం ద్వారా గమనింపబడాలని ప్రయత్నిస్తారు.
ఇంట్లో లేదా బయట ఒత్తిడి:
ఇంట్లో ఒత్తిడి లేదా ఇతర సమస్యలు ఉంటే, వారు ఆ కోపాన్ని స్కూల్‌లో తోటి పిల్లలపై చూపించి వారిని బాధపెడతారు.
తక్కువ ఆత్మవిశ్వాసం:
కొంత మంది విద్యార్థులు తాము ఉన్నతంగా కనిపించడానికి ఇతరులను దిగజార్చడం చేస్తారు.
చుట్టూ ఉండే వాతావరణం:
పుస్తకాలు, సినిమాలు, సోషల్ మీడియాలో చూపించబడే హింసాత్మక తీరు కూడా దీనికి కారణం అవుతుంది.
గుర్తింపు పోవడంలో విఫలం:
కొంతమంది తమ ప్రతిభను సరైన మార్గంలో చాటుకోలేకపోయినప్పుడు ఇతరులను ఏడిపించడం ద్వారా తమ ప్రాముఖ్యతను చాటుకోవాలని భావిస్తారు.
పరిష్కారాలు:
బోధకులు జాగ్రత్తగా గమనించాలి:
8 విద్యార్థుల నడవడికపై దృష్టి పెట్టి, వారిని సరిదిద్దే మార్గాన్ని చూపాలి.
మనోవేదన పరిష్కారం:
8 తరచుగా నొచ్చుకునే విద్యార్థులకు, ముఖ్యంగా బాధను అనుభవిస్తున్న వారికి, కౌన్సెలింగ్ అందించడం అవసరం.
పాజిటివ్ రోల్ మోడల్స్:
8 విద్యార్థులు మంచి ప్రవర్తన ఉన్న వ్యక్తులను ఆదర్శంగా తీసుకోగలగడానికి స్ఫూర్తిదాయక కథలు, వ్యక్తుల గురించి చెప్పాలి.
జట్టుగా పనులు చేయించడం:
8 టీమ్ వర్క్ వల్ల, విద్యార్థులు ఒకరికొకరు అర్థం చేసుకోవడం, గౌరవించుకోవడం నేర్చుకుంటారు.
రూల్స్ అమలు చేయడం:
8 తరగతి గదిలో కఠిన నిబంధనలతో పాటు, ప్రవర్తనకు గల ఫలితాలు తెలిపే విధంగా శిక్షణ ఇవ్వాలి.
డా|| హిప్నో పద్మా కమలాకర్,
9390044031
కౌన్సెలింగ్, సైకో థెరపిస్ట్,
హిప్నో థెరపిస్ట్