ట్యాబ్లెట్స్‌ వాడుతున్నారా.?

Are you using medicineతలనొప్పి ప్రతీ ఒక్కరిలో సర్వసాధారణంగా వచ్చే సమస్య. మనలో చాలా మంది ఏదో ఒక సమయంలో తలనొప్పి సమస్యను ఎదుర్కొనే ఉంటారు. నొప్పి రాగానే వెంటనే మందులు వేసుకుంటారు. అయితే ట్యాబ్లెట్‌ వేసుకుంటే వెంటనే ఉపశమనం లభించినా వాటివల్ల కలిగే దుష్ప్రభావాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అందుకే తలనొప్పిని వీలైనంత వరకు సహజ మార్గాల ద్వారానే తగ్గించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఆ నేచురల్‌ టిప్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
– ఉదయం నిద్రలేవగానే తలనొప్పిగా ఉండే వెంటనే మనలో చాలా మంది చేసే పని టీ తాగడం. అయితే టీకి బదులు తులసి టీ తాగడం వల్ల మెరుగైన ఫలితం పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం కొన్ని తులసి ఆకులను తీసుకొని నీటిలో మరిగించి తీసుకోవాలి. దీనివల్ల తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
– ఇక తలనొప్పి రావడానికి డీహైడ్రేషన్‌ కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. తగినంత నీరు తీసుకోకపోతే తలనొప్పి సమస్య వేధిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే కచ్చితంగా ప్రతీ రోజూ 3 నుంచి 4 లీటర్ల నీటిని తీసుకోవాలని సూచిస్తున్నారు.
– నిద్రలేమి కూడా తలనొప్పికి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి కచ్చితంగా రోజూ 7 నుంచి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి.
– స్మార్ట్‌ ఫోన్‌ వాడకం పెరగడం, గంటలతరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవడం కారణం ఏదైనా వీటివల్ల కూడా ఇటీవల తలనొప్పి సమస్య చాలా మందిలో పెరిగిపోయింది. అయితే ఈ సమస్యకు చెక్‌ పెట్టాలంటే వాటి వినియోగాన్ని తగ్గించాలి.