టాప్‌లోనే అర్జెంటీనా

టాప్‌లోనే అర్జెంటీనా– వరుసగా రెండో ఏడాది అగ్రస్థానంలోనే..
– ఫిఫా ర్యాంకింగ్స్‌
లాసనె : అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సమాఖ్య(ఫిఫా) ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో అర్జెంటీనా వరుసగా రెండో ఏడాది అగ్రస్థానంతో ముగించింది. ఫిఫా పురుషుల ర్యాంకింగ్స్‌లోను గురువారం వెల్లడించింది. ఈ ఏడాది అర్జెంటీనా 21 అర్జంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి అత్యధిక విజయాలను నమోదు చేసుకుంది. ఆ తర్వాత స్థానాల్లో య యూరోపియన్‌ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌, స్పెయిన్‌ జట్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే టాప్‌-10లో ఇంగ్లండ్‌, బ్రెజిల్‌, పోర్చుగల్‌, నెదర్లాండ్స్‌, బెల్జియం, ఇటలీ, మరియు జర్మనీ జట్లు ఉన్నాయి. ఫిఫా తాజాగా వెల్లడించిన ర్యాంకింగ్స్‌లో అంగోలా జట్టు 84వ స్థానం నుంచి ఏకంగా 32వ స్థానానికి ఎగబాకడం విశేషం. ఆ తర్వాత ఫిఫా 2025 ఏప్రిల్‌లో మళ్లీ ర్యాంకింగ్స్‌ను ప్రకటించనుంది.