ఆరిఫ్‌ ఖాన్‌ బాటలోనే… పంజాబ్‌ గవర్నర్‌

చంఢగీఢ్‌ : కేరళ గవర్నర్‌ అరీఫ్‌ ఖాన్‌ వ్యవహరించినట్లుగానే పంజాబ్‌ గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ కూడా వ్యవహరించారు. బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. పంజాబ్‌ అసెంబ్లీ ఆమోదించిన మూడు బిల్లులను రాష్ట్రపతి పరిశీలన కోసం పంపినట్లు గవర్నర్‌ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్లు నిరవధికంగా నిలిపివేయడం సరికాదని ఇటీవల సుప్రీంకోర్టు నిలదీయడంతో.. కేరళ గవర్నర్‌ ఏడు బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన సంగతి తెలిసిందే.