
మధ్యాహ్న భోజన కార్మికులకు బకాయి వేతనాలు,వంట,గుడ్లు బిల్లులు వెంటనే చెల్లించాలని, వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్థానిక విద్యాశాఖ మండల కార్యాలయంలో సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ మాట్లాడుతూ వంట కార్మికులు అనేక ఇబ్బందులు పడి,బయట వడ్డీలకు అప్పులు తెచ్చి వంట నిర్వహణ నిర్వహిస్తున్న అప్పటికి సకాలంలో బిల్లులు చెల్లించని కారణంగా అనే ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.నెలలు తరబడి బిల్లులు బకాయి పడుతున్న కారణంగా మా బిల్లులు విడుదల చేయండి అని సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా సమస్య పరిష్కారం కావడం లేదని అన్నారు.వంట బిల్లులు గుడ్లు బిల్లులు వేతనాలు బిల్లులు వెంటనే విడుదల చేయాలని ఈ నెల 11 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తున్నామని ఆ మేరకు ఎం.ఈ.ఓ క్రిష్ణయ్య కి సమ్మె నోటీసు ఇచ్చామని అన్నారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజనం మండల అధ్యక్షురాలు నన్ని యామిని,నాగ దుర్గ,సీత దశమి దేవి,వెంకమ్మ,సత్యవతి లీల తదితరులు పాల్గొన్నారు.