నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్ పదిహేడో సీజన్‌లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి వైదొలిగిన ముంబై ఇండియన్స్ ఆఖరి మ్యాచ్‌కు సిద్ధమైంది. వాంఖడే వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో హార్దిక్ పాండ్యా సేన అమీతుమీ తేల్చుకోనుంది. టాస్ గెలిచిన పాండ్యా బౌలింగ్ తీసుకున్నాడు. లక్నో జట్టు రెండు మార్పులతో ఆడుతుడంగా ముంబై కీలక ఆటగాళ్లు రోహిత్ శర్మ, పేసర్ బుమ్రా ఆడడం లేదు. దాంతో ఈ సీజన్‌లో అర్జున్ టెండూల్కర్ తొలిసారి తుది జట్టులోకి ఎంపికయ్యాడు. ప్లే ఆఫ్స్ ఆశలు ఆవిరైన వేళ విజయంతో మెగా టోర్నీని ముగించాలని ఇరుజట్లు పట్టుదలతో ఉన్నాయి.