– నగర కొత్వాల్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి
– నగర సాయుధ దళం, శిక్షణ వింగ్స్‌ను సందర్శించిన సీపీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాజధాని నగర రక్షణలో హైదరాబాద్ నగర సాయుధ బలగాల పాత్ర కీలకమైందని, సాయుధ బలగాలే హైదరాబాద్ పోలీసుల బలం అని నగర కొత్వాల్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం ఉదయం నగర సాయుధ దళం విభాగంతోపాటు శిక్షణ వింగ్స్‌ను సీపీ సందర్శించారు. పేట్లబుర్జు మైదానంలో వివిధ విభాగాలకు చెందిన పోలీస్ బల గాలతో సెరిమొనియల్ పెరేడ్ శనివారం నిర్వహిం చారు. ఈ క్రమంలో జాయింట్ సీపీ వీ. సత్యనారా యణతో కలిసి సీపీ పరేడ్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది, అధికారులనుద్ధేశించి సీపీ మాట్లాడారు. 1932లో ‘ఆఫ్ఘన్ సిటీ పోలీస్’ సాయుధ వ్యవస్థగా ప్రారంభించారని, ఇప్పుడు నగర సాయుధ దళాల వ్యవస్థగా రూపొంతంరం చెందిందని గుర్తు చేశారు. ఎంతోరూపాంతరం చెంది నగరంలో శక్తివంతమైన పోలీస్ ఫోర్స్‌గా మారిందని చెప్పారు. వీఐపీ సెక్యూరిటీ, చీఫ్ మినిస్టర్, గవర్నర్లకు రక్షణ వ్యవస్థ మారిందన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్, ఐపీఎస్, పీఎస్‌ఓ, క్యూఆర్‌టీ, సీఆర్‌ఏఎఫ్, సీఎస్‌జీ, డాగ్‌స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్స్‌తోపాటు నాలుగు ట్రైనింగ్ సెంటర్లు, హెచ్‌జీఓల్లో పటిష్టంగా విధులు నిర్వహిస్తున్నారని వివరించారు. వీళ్లంతా నిరంతరం నూతన సాంకే తికను, శారీరక సామర్ధ్యాన్ని పెంచుకుని రాజధానికి మరింత మంచి పేరుతే వాలని కోరారు. వివిధ దళాల పనితీరుకు ప్రశంసిస్తూ సలహాలు, సూచనలు చేశారు. భద్రత విషయంలో ఎలాంటి అలాస్వతానికి తావు లేకుండా విధులు నిర్వహించాలన్నారు. వెల్ఫేర్ విషయంలో మహిళా పోలీసులకు కావలిసిన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. డ్రైవర్లు విధులు నిర్వహిస్తున్నపుడు నూతన సాంకేతికతను వినియోగించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డీసీపీ అడ్మిన్ బాపు రావు, డీసీపీ సీఎస్ డబ్ల్యూ అలెక్స్, అడిషనల్ డీసీపీలు ఎం. మాణిక్ రాజ్, లక్ష్మి నారాయణ, భాస్కర్, కృష్ణ రెడ్డి, వినోద్ కుమార్, విజరు కుమార్, ఎం. వెంకట్ రావు, ఏసీపీలు సీఎచ్. వై. శ్రీనివాస్ కుమార్, విక్రమ్ దేవ్, వై. మట్టయ్య, టీ. నరేందర్ రావు, బీ. యాకుబ్ రెడ్డి, కే.వీ.ఆర్. సత్యనారాయణ, జీ. శ్రీను, పీ. భాస్కర్, ఉదయ కృష్ణ, ప్రసన్న లక్ష్మి, బీ. మురళి తదితరులు పాల్గొన్నారు.