ప్రశాంత వాతావరణంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ చర్యలు..

– జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్..
నవతెలంగాణ వేములవాడ రూరల్ : వేములవాడ రురల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రిటికల్, నార్మల్ పోలింగ్ స్టేషన్స్ ల వద్ద తనిఖీ నిర్వహించారు.
సోమవారం  వేములవాడ రురల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టెముల, ఫజుల్ నగర్, నుకలమర్రి, ఏదురుగాట్ల,మర్రిపెళ్లి,లింగంపెళ్లి, గ్రామాల్లోని నార్మల్, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి శాంతియుత వాతావరణంలో ఎన్నికల జరిగేలా అన్ని రకాల భద్రత చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అధికారులకు  ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ… రానున్న సాధారణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వేములవాడ రురల్ పరిధిలోని పలు నార్మల్, క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ లను సందర్శించి,అత్యవసరం ఉన్న పోలింగ్ స్టేషన్ ప్రాంతాలలో సిసి కెమెరాల ఏర్పాటు, పోలింగ్ స్టేషన్ లో మౌలిక సదుపాయాల ఏర్పాటు ముందుగానే చూసుకోవాలని, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేయాలని, అధికారులు సిబ్బంది ఎల్లప్పుడూ అలర్ట్ గా ఉంటూ, సమస్యాత్మక గ్రామాలను విధిగా పర్యటిస్తూ అట్టి  గ్రామాలపై దృష్టిసారించాలని అధికారులకు తెలిపారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర సాయుధ బలగాల చేత ఫ్లాగ్ మార్చ్ లు నిర్వహించి ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటు వినియెగించుకునేల ధైర్యం కల్పించడం జరుగుతుంది అన్నారు. ప్రతి ఒక్కరు ఎన్నికల నియమావళిని పాటించాలని ప్రయాణ సమయాల్లో యాబై వేళా కంటే ఎక్కువ నగదు తీసుకవేళ్ళేవారు వాటికి సంబంధించిన సరైన పత్రాలు దగ్గర పెట్టుకోవాలని సూచించారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ప్రజలు పోలీస్ వారికి సహకరించాలని కోరారు..ఎస్పీ  వెంట డిఎస్పీ నాగేంద్రచరి, సి.ఐ కృష్ణకుమార్,ఎస్.ఐ మారుతి సిబ్బంది ఉన్నారు.