పకడ్బందీగా పోలీస్‌ బందోబస్తు : ఎస్పీ

నారాయణపేటటౌన్‌: పార్లమెంట్‌ ఎన్నికలకు పకడ్బందీగా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ ఆదివారం ఒక ప్రక టనలో తెలిపారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియో గించు కోవా లని సూచించారు. డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్ల నుంచి ఈవీఎం బాక్సులు, పోలింగ్‌ సామాగ్రీ పోలింగ్‌ కేంద్రా లకు వెళ్లే సమయంలో సాయుధ పోలీస్‌ బలగాలతో ఎస్కార్ట్‌ తో వెళ్లడం జరుగుతుందని తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 1,300 మంది పోలీసు అధికారులు సిబ్బందితో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓటర్లు విధిగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రత్యేక దష్టి సారించి కేంద్ర సాయుధ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా పరిధిలో మూడు నియోజకవర్గాలను 62 రూ ట్‌లుగా విభజించి 553 పోలింగ్‌ కేంద్రాలలో బందోబస్తు ఏర్పాటు చేశా మన్నారు. ఉదయం 6 గంటల నుంచి పోలింగ్‌ కేంద్రాల వద్ద సంసిద్ధంగా ఉంటారని, పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా స్ట్రైకింగ్‌ ఫోర్స్‌, స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేయడం జరిగిందని, ఎక్కడ సమస్యలు ఉన్న వెంటనే పోలీస్‌ వారు అక్కడికి చేరుకొని సమస్య పరిష్కరించనున్నట్లు తెలిపారు. పార్లమెంట్‌ ఎన్నికలు పూర్తయ్యేవరకు సోషల్‌ మీడియాపై పూర్తిస్థాయి నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, ఎవరైన కంప్లైంట్‌ చేయాలనుకుంటే సీ-విజిల్‌ యాప్‌ నుంచి కంప్లైంట్‌ చేయాలని సూచించారు. జిల్లాలో ఎలక్షన్‌ కోడ్‌ మొదలు ఇప్పటివరకు రూ.1,48,96,300లు సీజ్‌ చేసి గ్రివియస్‌ కమిటీకి పంపిం చడం జరిగిందని, 3302.565 లిక్కర్‌ వాటి విలువ రూ.17,18,036 రూ విలువ గల లిక్కర్‌ సీజ్‌ చేసినట్లు తెలిపారు. గోల్డ్‌ 539.930 గ్రాముల బంగారం వాటి విలువ రూ.17,00,000 ఉంటుందని, 427 గ్రాముల వెం డి వాటి విలువ రూ.31,000 సీజ్‌ చేయడం జరిగిందని తెలిపారు. 4,051 దుస్తులు వాటి విలువరూ. 2,32,500 ల విలువ గల దుస్తులు సీజ్‌ చేసి నట్లు పేర్కొన్నారు. ముందస్తు 785 మంది వ్యక్తులను బైండోవర్‌ చేసినట్లు వివరించారు. జిల్లా పరిధిలో ప్రజలు ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, ఎన్నికలు సజావుగా జరిగేందుకు జిల్లా ప్రజలు పోలీస్‌లకి సహకరించాలని ఎస్పీ కోరారు.