
పట్టణ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు గా విధులు నిర్వహిస్తున్న బస్వారెడ్డి అడిషనల్ ఎస్పీగా పదోన్నతి కల్పిస్తూ హైదరాబాద్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా రాష్ట్రంలో పనిచేస్తున్న 13 మంది ఏసీపీలను అడిషనల్ ఎస్పీలుగా ప్రమోటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏసిపి హైదరాబాద్ డిజిపి కార్యాలయంలో రిపోర్ట్ చేయవలసిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.. గత ఫిబ్రవరి 19వ తేదీ ఆర్మూర్ ఎసిపి గా బస్వా రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టి శాంతి భద్రతల పరిరక్షణలో నిర్విరామ కృషి చేసినారు.