
గల్ఫ్ కార్మికుల సమస్యలను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని ఆయన స్పీకర్ దృష్టికి తీసుకువెళ్లారు. గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమానికి 1000 కోట్లను బడ్జెట్లో కేటాయించాలని ఆయన కోరారు. గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలని సభలో చర్చించారు. గల్ఫ్ మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి 10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలన్నారు.
నియోజకవర్గానికి ఒక్క ఇల్లు రాలేదు..
గత 10 సంవత్సరాలలో నియోజకవర్గంలో ఒక్క ఇల్లు రాలేదని ఎమ్మెల్యే అన్నారు. స్థలాలు ఉన్నవారికి 5 లక్షలు ఇవ్వాలని, ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలం ఇవ్వాలని ఆయన అసెంబ్లీలో అన్నారు. నియోజకవర్గంలోని సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 22 లేఖలను రాశామన్నారు. అర్హులైన పేదలకు ఇండ్లు, పింఛన్లు ఇవ్వాలని సభలో కోరారు.