టిఎన్జీవో కేంద్ర సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, హుస్సేన్ ల ఆదేశాల మేరకు సోమవారం టీఎన్జీవో ఆర్మూర్ యూనిట్ ఆధ్వర్యంలో యూనిట్ అధ్యక్షులు షికారి రాజు, యూనిట్ కార్యదర్శి గోవర్ధన స్వామి, అధ్యక్షతన టీఎన్జీవో జిల్లా కార్యాలయం నందు ఏర్పాటుచేసిన టీఎన్జీవో ఆర్మూర్ యూనిట్ అత్యవసర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. యూనిట్ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న బాధ్యులు ఉద్యోగుల సమస్యలపై ఇతరత్రా విషయాలపై తీర్మానాలు చేసి, అనంతరం ఇటీవలే సాదరణ బదిలీల్లో ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లినందున ఖాళీలు ఏర్పడ్డ అధ్యక్ష కార్యదర్శులు ఇతరత్రా పదవులకు గాను, యూనిట్ నూతన అధ్యక్షులుగా కుంట శశికాంత్ రెడ్డి (వ్యవసాయ శాఖ) ని, యూనిట్ కార్యదర్శిగా న్యాలకంటి విశాల్ (ట్రెజరీ శాఖ) ను, సహాధ్యక్షులుగా లయన్ శేఖర్( మున్సిపల్ శాఖ) ని, కోశాధికారిగా కస్తూరి శ్రీనివాస్ (నీటిపారుదల శాఖ) ని, కో ఆప్షన్ పద్ధతిన ఎన్నుకున్నారు. సమావేశాన్ని ఉద్దేశించి టీఎన్జీవో జిల్లా అధ్యక్షుల నాశెట్టి సుమన్ కుమార్ మాట్లాడుతూ..సభ్యులందరూ ఏకవాక్య తీర్మానంతో యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులను కో ఆప్షన్ పద్ధతిన ఎన్నికకు సహకరించినందుకు ప్రతి సభ్యుడికి పేరుపేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు సంఘటితంగా ఉద్యోగుల సమస్యలపై పోరాడి, హక్కుల సాధన కొరకు నిరంతరం కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, సహాధ్యక్షులు చిట్టి నారాయణ రెడ్డి, కేంద్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, టీఎన్జీవో ఆర్మూర్ యూనిట్ పూర్వధ్యక్ష, కార్యదర్శులు షికారి రాజు, గోవర్ధన్ స్వామి ,జిల్లా కార్యవర్గ సభ్యులు, ఆర్మూర్ యూనిట్ కార్యవర్గ సభ్యులు అధిక సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు.