ఇజ్రాయిల్‌కు ఆయుధ సరఫరా తగదు

Arms supply to Israel is inadequate– నిరసనగా అమెరికా విదేశాంగ శాఖ అధికారి రాజీనామా
అమెరికా విదేశాంగ శాఖలో ఆయుధ సరఫరాకు బాధ్యుడుగావున్న ఒక అధికారి ఇజ్రాయిల్‌ కు అమెరికా ఆయుధ సరఫరా చేయటంపట్ల నిరసనగా రాజీనామా చేశా రు. ఇజ్రాయిల్‌కు అమెరికా ఆయుధ సర ఫరా చేయటం ”దూరదృష్టిలేని, వినాశకర మైన, అన్యాయమైన, అమెరికా నిత్యం బహి రంగంగా ప్రకటించే విలువలకు వ్యతిరేకమై న చర్య”గా ఆయన అభి వర్ణించారు. జోష్‌ పాల్‌ బ్యూరో ఆఫ్‌ పొలిటికల్‌-మిలిటరీ ఎఫైర్స్‌(పిఎమ్‌)కి 11 ఏండ్లపాటు డైరెక్టర్‌గా వ్యవహ రించారు. బుధవారంనాడు తన రాజీనామా లేఖను తన లింక్డ్‌ఇన్‌ ప్రొఫైల్‌లో పెట్టారు. అదేరోజు మొట్టమొదటిసారిగా హఫ్పింగ్టన్‌ పోస్టు ఈ విషయాన్ని రిపోర్ట్‌ చేసింది. తను చేసేపనిలో ”నైతిక సంక్లిష్టత, నైతికంగా రాజీ పడటం”వంటివి ఉంటాయని తెలుసని, తను చేసే చెడుకంటే ”తను చేయగల మంచి ఎక్కువగా ఉంటుందని” భావించానని పాల్‌ అన్నాడు.
అయితే ఇజ్రాయిల్‌కు మానవ హనన ఆయుధా లను అందించాలనే అమెరికా నిర్ణయంతో తన పనిలో మంచి కంటే చెడే ఎక్కువగా ఉందని గ్రహించి రాజీనామా చేశానని ఆయన అన్నారు. అమెరికా దశాబ్దాలుగా అవే తప్పులను మరలామరలా చేస్తోందని, ”పక్షపాతమనే పునాదిపై మరుక్షణమే ప్రతిస్పందించటం, రాజకీయ సౌకర్యం, మేధో దివాళాకోరుతనం, అధికార మందబుద్ధి’లతో కూడిన విధానాన్ని అమెరికా అవలంభిస్తోందని ఆయన చెప్పారు. మధ్యప్రాచ్యంలో తనకున్న అనుభవం, ఇజ్రాయిల్‌, పాలస్తీనా అథారిటీలతో చేసిన అధికారిక పనిని గురించి పాల్‌ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఘర్షణలోవున్న ఇరువైపులా తనకు లోతైన వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని, తన భాగ స్వామి చేస్తున్న తప్పుడు పనులను అమెరికా సమర్థించటాన్ని తాను ఖండిస్తున్నా నని పాల్‌ తన రాజీనామా లేఖలో రాశారు. మెరుగైన ప్రపంచాన్ని నిర్మించటంలో సమిష్టిగా శిక్షిం చటం అడ్డంకిగా ఉంటుందని, అది ఒక ఇంటిని లేక ఒక వేయి ఇండ్లను కూల్చటం, ప్రజలను తెగ ఆధారంగా నిర్మూ లించటం, ఆక్రమించటం, వర్ణ వివక్షవంటి రూపాలలో ఉంటుందని ఆయన అన్నారు.
సహాయ ట్రక్కులకు అనుమతివ్వండి : ఐరాస
ఇజ్రాయిల్‌ దిగ్బంధనంతో ఇబ్బందులు పడుతున్న గాజా ప్రజలకు సాయం అందేందుకు వీలుగా సహాయ ట్రక్కులను అనుమతించాల్సిందిగా ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన రాఫా సరిహద్దు క్రాసింగ్‌ను సందర్శించారు. పాలస్తీనియన్లు కూడా అందబోయే సాయం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇదిలావుండగా, లెబనాన్‌తో గల సరిహద్దులో హిజ్బులా తీవ్రవాదులతో రోజుల తరబడి ఘర్షణలు కొనసాగించిన అనంతరం ఉత్తర ప్రాంత కిర్యాత్‌ షామోనా నగరాన్ని ఖాళీ చేయనున్నట్లు శుక్రవారం ఇజ్రాయిల్‌ అధికారులు ప్రకటించారు.