స్వార్థం, లాభం చేతుల్లో చిక్కి
శాంతిని దూరంగా చీకట్లో నెట్టేసి
రాజకీయ నీడలో
ఆయుధ ఒప్పందం
నిశ్శబ్దంగా జరిగిపోయింది.
తుపాకులు, ఇతర యుద్ధ సామాగ్రి
అమ్ముడుపోతాయి
చేతులు మారి తిరుగుతున్న ఆయుధాలు
ఇప్పుడు బహిరంగ రహస్యం.
కొందరి డబ్బు
ఆయుధాలు కొని
యుద్ధానికి ఆజ్యం పోస్తుంది.
ఎందరో అమాయకులు
యుద్ధానికి మూల్యం చెల్లిస్తారు.
యుద్ధం
ఆయుధాల పవర్ గేమ్ కాదు.
యుద్ధం తరువాతే
ఆర్తనాదాల శబ్దం
రణభేరిని మించి మోగుతుంది.
– కుడికాల వంశీధర్
9885201600