దేశ‌రక్షణ ఉద్యోగం కాదు ఉద్వేగభరిత బాధ్యత: ఆర్మీ జవాన్ లు

నవతెలంగాణ – అశ్వారావుపేట
దేశ రక్షణా దళం చేరడం ఉద్యోగం చేయడం కోసం కాదని అదో ఉద్వేగభరిత బాధ్యత అని ఆర్మీ లో సుమారు 15 సంవత్సారాలు సేవలు అందించి పదవి విరమణ పొందిన రాజా రావు, హమీద్, ఇజ్రాయేల్,అర్జున్ సింగ్ లు వ్యాఖ్యానించారు. బుధవారం స్థానిక వ్యవసాయ కళాశాలలో జాతీయ సేవ పధకం ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకుంటూ “మేరీ మిట్టి – మేరీ దేశ్” అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పైన ఉదాహరించిన నలుగురు మాజీ ఆర్మీ జవాన్లను పిలిచి సత్కరించారు.విద్యార్థులు వాళ్ళ రాకని కరతాళ ధ్వనులతో నే కాక “జై జవాన్, జై కిసాన్” అని నినాదాల తో ఆహ్వానించారు. ఈ సందర్భంగా జవాన్లు మాట్లాడుతూ ఆర్మీ అనేది ఒక ఉద్యోగం కాదని,అదొక ఉద్వేగం అని వర్ణించారు. అప్పటి కార్గిల్ యుద్ధాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రతి విద్యార్థి లో దేశభక్తి చాల కీలకం అని,దాన్ని సరైన పంధాలో పెడితే దేశానికి ఉపయోగ పడ్తారని వివరించారు.కళాశాల ఇంచార్జి అసోసియేట్ డీన్ డాక్టర్ ఐ.వి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ రంగ శాస్త్రవేత్తలు గోపాల కృష్ణ మూర్తి, రామ్ ప్రసాద్, పావని, నీలిమ, శ్రావణ్ కుమార్, కృష్ణ తేజ, జంబమ్మ, సిబ్బంది స్రవంతి, రెహ్మాన్, ఇతర అధ్యాపకులు ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు. కార్యక్రమంలో  కళాశాల అధ్యాపకుల, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు అందరూ దేశం పట్ల ఉద్వేగ భరితంగా అనుభూతి చెందారు. జాతీయ సేవ పధకం అధికారి డాక్టర్  కడ సిద్ధప్ప ఈ కార్యక్రమాన్ని సమన్వయ పరిచారు.