అధికార లాంఛనాలతో ఆర్మీ ఉద్యోగి అంత్యక్రియలు

భట్టిప్రోలు: విధి నిర్వహణలో భాగంగా కాశ్మీర్‌ లోయలో పడి మృతి చెందిన ఆర్మీ ఉద్యోగి పప్పల శ్రీరాములు అంతిమయాత్ర బాపట్ల జిలా భట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామంలో మంగళవారం నిర్వహించారు. శ్రీరాములు గత పదేళ్ల క్రితం ఆర్మీలో చేరారు. ప్రస్తుతం చండీగఢ్‌ మంచు పర్వతాల్లో విధులు నిర్వహిస్తుండగా గత నెల 27న జారి లోయలో పడిపోయారు. తోటిసైనికులు గమనించి శ్రీరాములను వైద్య చికిత్స నిమిత్తం వైద్య శాలలకు తరలించారు.