ఆరోగ్య మిత్రలను డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ గా గుర్తించాలి

Arogya Mitra should be identified as Data Processing Officer– కనీస వేతనం ఇవ్వాలి..
– ఆరోగ్య మిత్ర సమ్మెలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
ఆరోగ్య మిత్రలను డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ గా గుర్తించాలని , జి ఓ 60 ప్రకారం కనీస వేతనం ఇవ్వాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆరోగ్య మిత్రల సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర వ్యాపితంగా చేపట్టిన సమ్మెలో భాగంగా జిల్లా ఆరోగ్య మిత్రుల సమ్మె నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మాట్లాడుతూ 2007 సంవత్సరం నుండి నేటికి గత 17 సంవత్సరాలుగా ఆరోగ్య మిత్రలు ఆరోగ్య శ్రీ సేవలు ప్రజలకు అందిస్తూ సేవలు చేస్తున్నారనీ కానీ నేటికి వారి వేతనం 13 వేలు దాటలేదని అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి కాంట్రాక్టు పద్దతిలో జిఓ 60 ప్రకారం కనీసవేతనం 22,750 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని , ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలనీ ఆరోగ్య డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మెకు ప్రజలు , ప్రజా సంఘాలు మద్దత్తు ఇవ్వాలని , సమ్మె జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమ్మె కార్యక్రమంలో ఆరోగ్య మిత్రల యూనియన్ జిల్లా అధ్యక్ష , కార్యదర్శులు మీసాల మహేష్ , మొగులుగానీ కాటమయ్య , కోశాధికారి సబిత యూనియన్ జిల్లా నాయకులు మహేందర్ , బాలయ్య , సుమ,ఇందిరమ్మ , జ్యోతి ,శ్రీను ,జ్యోతి ,శారద ,జ్యోతిలు పాల్గొన్నారు.