
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
తెలంగాణ రాష్ట్రం లో హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా నిర్వహించ బడుతున్న ఆరోగ్య శ్రీ పథకం ప్రభుత్వ , ప్రయివేటు హాస్పిటల్ లలో ఆరోగ్య మిత్ర గా పని చేస్తున్న సిబ్బందికి వెంటనే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆరోగ్యశ్రీ సిబ్బందితో కలిసి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూరాష్ర్ట వ్యాప్తంగా 900 మంది సిబ్బంది వివిధ కేటగీరీలలో జిల్లా మేనేజర్, టీమ్ లీడర్, ఆఫిస్ అసోసియేట్ ఆరోగ్య మిత్రలు గా 2007 నుండీ 24గంటలు పని చేస్తున్నారని ఆరోగ్య శ్రీ పథకం కింద లక్షల మంది కి అఫరేషన్లు జరగటానికి క్షేత్ర స్థాయిలో ఆరోగ్య మిత్రల పాత్ర మరువలేనిదనీ నెమ్మాది అన్నారు.18 సెప్టెంబర్ నుండీ రాష్ట్ర వ్యాపితంగా సమ్మె చెస్తున్నారు. గత తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య మిత్రలను పట్టించుకోకుండా వెట్టి చాకిరీ చేయించుకుందని ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వమైనా ఏంతో ఉన్నత విద్యా చదివి సమాజానికి ఏంతో సేవ చేస్తున్న ఆరోగ్య మిత్రలకు న్యాయం చేయాలని కోరారు.ఆరోగ్య మిత్రాలను డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ గా గుర్తించాలని, జీవో నెంబర్ 60 ప్రకారం 22,750 రూపాయలు ఇవ్వాలని, ఆరోగ్య మిత్ర వేతనాలు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా కాకుండా ట్రస్ట్ ల ద్వారా ఇవ్వాలని, రాబోయే పీఆర్సీ ప్రకారం 35000 రూపాయలు ఇవ్వాలని, అదనంగా టీ ఏ, డీ ఏ లు ఇవ్వాలని,16 సవంత్సరాల నుండీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసిన ఆరోగ్య మిత్రలను తిరిగి మండల కేంద్రాలకు పంపాలి.వివిధ కారణాలతో చనిపోయిన వారికి 50 లక్షల ఎక్స్ గ్రెసియా చెల్లించాలని, ఉద్యోగులందరికీ హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని వివిధ డిమాండ్స్ లతో కూడిన వినతిత్రాన్ని కలెక్టర్ కార్యాలయం ఏవో కు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆరోగ్య మిత్ర యూనియన్ జిల్లా అద్యక్షుడు చత్రు నాయక్, రమేష్, వేణు గోపాల్ రెడ్డి సురేష్, కిషోర్, సుజాత, గఫార్, మధు, బద్రు, నరసింహ రావు, పులు రెడ్డి తదితరులు పాల్గోన్నారు.