– సిద్ధిపేట ఆర్డిఓ రమేష్ బాబు
నవతెలంగాణ- దుబ్బాక / దుబ్బాక రూరల్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా తెల్లరేషన్ కార్డు ఉన్న కుటుంబానికి ఆరోగ్య బీమా రూ.5 లక్షల నుండి రూ.10 లక్షల వరకు పెంచుతున్నట్లు సిద్ధిపేట ఆర్డిఓ రమేష్ బాబు, దుబ్బాక మున్సిపల్ ఛైర్ పర్సన్ వనిత, ఎంపీపీ పుష్పలత తెలిపారు.ఆదివారం దుబ్బాక పట్టణంలోని 100 పడకల ఆసుపత్రిలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల వైద్య సాయం పెంపుకు సంబంధించిన గోడపత్రికలను డిప్యూటీ డిఎంహెచ్వో శ్రీనివాస్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్.హేమరాజ్ సింగ్,మున్సిపల్ చైర్పర్సన్ గన్నేవనిత, ఎంపీపీ కొత్త పుష్పలత, జడ్పీటీసీ కడతల రవీందర్ రెడ్డి లతో కలిసి సిద్ధిపేట ఆర్డిఓ రమేష్ బాబు ఆవిష్కరించారు.ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బారాస నాయకులు రొట్టె రాజమౌళి, గుండెల్లి ఎల్లారెడ్డి,
దేవుని చంద్రయ్య, గన్నె భూంరెడ్డి, కొత్త కిషన్ రెడ్డి, పల్లె రామస్వామి, పలువురు కౌన్సిలర్లు, ఆరోగ్య శ్రీ ఇంచార్జ్ శ్రీహరి, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.