నవతెలంగాణ – రామారెడ్డి
రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి నామినేటెడ్ పోస్టుల కోసం జిల్లాలోని పలువురు కాంగ్రెస్ నాయకులు హైదరాబాదులో మంక్కం వేసి మంత్రులను, పెద్ద నాయకులను కలుస్తూ, నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం ఇవ్వాలని మొర పెట్టుకుంటున్నారు. గత పది సంవత్సరాల నుండి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల స్థాయి నాయకులు పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా కష్టపడి పని చేసినందుకు, గుర్తించాలని, జిల్లా గ్రంధాలయ చైర్మన్ తో పాటు పలు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. కష్టపడిన నాయకులకు పదవులు దక్కాలని పలువురు కోరుతున్నారు. ఎవరికి ఏ పదవులు తగ్గుతాయో వేచి చూడవలసిందే.