
భిక్కనూరు పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో ఆర్టిఐ జిల్లా ప్రతినిధి రవీందర్ మంగళవారం ప్రయాణికుల కొరకు బెంచిలను ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్టాండ్ లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరారు. త్వరలోనే తన వంతు సహకారంగా బస్టాండ్ లో లైటింగ్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వేణు, రామగిరి, కంట్రోలర్ మల్లేష్, తదితరులు ఉన్నారు.