పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

– మంది విద్యార్థులు, 04 కేంద్రాలు
– ఇద్దరు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ల ఏర్పాటు
– సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా
నవతెలంగాణ – పెద్దవూర
మండలం లో ఈ నెల 18 నుంచి ప్రారంభంకానున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎంఈఓ బాలునాయక్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షలకు పెద్దవూర మండల కేంద్రం లో రెండు, నాగార్జున సాగర్ లో రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలలో మొత్తం మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వారి కోసం పెద్దవూర మండలం లో 04 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మండల కేంద్రం లో రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.స్థానిక జెడ్ పీ హెచ్ ఎస్ ఉన్నత పాఠశాలో  240మంది,న్యూ కిడ్స్ ఉన్నత పాఠశాలలో169మంది,అలాగే నాగార్జున సాగర్ మున్సిపాలిటీలో రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. సేంట్ జోషఫ్, పాఠశాల లో 170, ప్రభుత్వ జూనియర్ కళాశాల లో 139 మొత్తం 718 మంది పరీక్షలు రాయనున్నారు. మార్చి18 నుంచి ఏప్రిల్ 2 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జరుగుతాయన్నారు. విద్యార్థులను 9 గంటల వరకు కు కేంద్రాల్లోకి అనుమతిస్తామన్నారు. విద్యార్థులు నేలపై కూర్చొని పరీక్ష రాయకుండా ఉండేందుకు అన్ని కేంద్రాల్లో అవసరమైన సామగ్రి ఏర్పాటు చేశారు.పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించేందుకు ప్రభుత్వం వీలుకల్పించింది. పరీక్షకు వచ్చేటప్పుడు, పరీక్ష ముగిసిన తర్వాత ఇళ్లకు వెళ్లేటప్పుడు తమ హాల్‌ టిక్కెట్లు చూపి ఉచితంగా ప్రయాణించవచ్చు అన్ని కేంద్రాల్లో అత్యవసర మందులతో వైద్యారోగ్యశాఖ సిబ్బంది ఒకరు అందుబాటులో ఉంటారు.పరీక్షా కేంద్రాలను నోమొబైల్‌ ఫోన్‌ జోన్‌గా ప్రకటించారు. కేంద్రాల్లో చీఫ్‌లు, డిపార్ట్‌మెంట్‌ అధికారులు, ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బంది, వైద్య సిబ్బంది ఇలా ఎవరిదగ్గరా సెల్‌ఫోన్లు ఉండ కూడదు.అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది.మాస్‌ కాపీయింగ్‌ను నిరోధించేందుకు ఇద్దరిని ఫ్లయింగ్‌ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. స్క్వాడ్స్‌ ప్రతిరోజూ కేంద్రాలను తనిఖీ చేస్తాయి.పరీక్షల విధుల్లో ఉన్నవారు మినహా బయటి వ్యక్తులను కేంద్రాల్లోకి అనుమతించరు.
దివ్యాంగులకు అవసరమైతే స్కైబ్‌ను ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.పరీక్షల సమయం లో ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మండల కేంద్రం లో జిరాక్స్ సెంటర్లు ముసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా పరీక్ష కేంద్రాలవద్ద పోలీస్ భద్రత కల్పించనున్నారు.