పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
ఈ నెల 18 సోమవారం నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు జరగనున్న పదో తర గతి పరీక్షల నిర్వహణకు అధికారులు ఆదివారం ఏర్పాట్లను  పూర్తి చేశారు. ఈ పరీక్షలకు 22 పాఠశాలలకు చెందిన 822 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందులో బాలురు 396 మంది. బాలికలు 426 మంది ఉన్నారు. మొత్తం 4 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. హుస్నాబాద్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ఆదర్శ పాఠశాల, టి ఎస్ ఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్ బాలుర పాఠశాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రానికి ఒక చీఫ్ సూపెరిండేంట్( సి ఎస్ ), ఓక డిపార్ట్మెంట్ ఆఫీసర్స్(డి ఓ ) మరియు 4 సెంటర్స్ కలిపి మొత్తం  47 మంది ఇన్విజిలెటర్స్ విధులు నిర్వర్తిస్తారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు ఉంటాయని ఎంఈఓ దేశి రెడ్డి పేర్కొన్నారు. పరీక్ష రాసే విద్యార్థులు ఉదయం 8.30 గంటలకల్లా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని పరీక్షల విభాగం స్పష్టం చేసింది. 9.30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, మరో ఐదు నిమిషాల వరకు విద్యార్థులను అనుమతిస్తామని తెలిపారు.