
నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలో ఉందని, ఎన్నికల నిర్వహణ ఏర్పట్లను పూర్తి చేయాలని పోలీస్ , తహసిల్దార్ ను ఆదేశించారు. గురువారం హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో కరీంనగర్, వరంగల్, సిద్దిపేట జిల్లాల ఏసీపీలు, సి ఐ లు, ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు. హుస్నాబాద్ మూడు జిల్లాల పరిధిలో ఉండటాన్ని ప్రత్యేకంగా చూడాలన్నారు. పోలింగ్ స్టేషన్ల యొక్క రూట్ మ్యాప్, సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్ లను గుర్తించాలన్నారు. ఎన్నికల నిర్వహణలో ఏలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేటట్లు చూడాలన్నారు. ఎన్నికలకు కావలసిన ఏర్పాట్లను పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఏసీపీలు , సిఐలు ,ఎస్ఐలు, తహసిల్దార్లు పాల్గొన్నారు.