నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్ : హుస్నాబాద్ లో ఈనెల 20న కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే భారీ బహిరంగ సభకు శుక్రవారం ఏర్పాట్లను పార్టీ నాయకులు చేపట్టారు. అక్కన్నపేట రోడ్డులో స్తూపం వద్ద బహిరంగ సభ కోసం ట్రాక్టర్లతో చదును చేస్తున్నారు. బహిరంగ సభకు ప్రియాంక గాంధీ తో పాటు రేవంత్ రెడ్డి హాజరవుతారని మండల అధ్యక్షుడు బంక చందు తెలిపారు.