ప్రజా పాలనకు ఏర్పాట్లు పూర్తి

– జిల్లా సహకార అధికారి సయ్యద్ ఖుర్షీద్

నవతెలంగాణ – పెద్దవంగర
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా పాలన కార్యక్రమానికి మండలంలో ఏర్పాట్లు పూర్తి అయినట్లు జిల్లా సహకార అధికారి సయ్యద్ ఖుర్షీద్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో ప్రజా పాలన పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ వీరంగటి మహేందర్, ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి తో కలిసి మాట్లాడారు. మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌ కార్డుల జారీ తదితర అంశాలకు సంబంధించిన దరఖాస్తులు నేటి నుండి స్వీకరిస్తామని చెప్పారు. ఒక్కో కేంద్రంలో నాలుగు కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. నోడల్ అధికారుల పర్యవేక్షణలో దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. కాగా షెడ్యూల్ ప్రకారం జనవరి 6 వరకు కొనసాగుతుందని చెప్పారు. వివిధ పథకాల కోసం వచ్చిన దరఖాస్తుల వివరాలను ఎప్పటికప్పుడు రిజిస్టర్‌తో, పాటుగా ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నట్లు తెలిపారు. మహిళలకు ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాట్లు చేశామని, అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజా పాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీఓ సత్యనారాయణ, మిషన్ భగీరథ ఏఈఈ యాకూబ్ పాషా, ఆర్ఐ భూక్యా లష్కర్, ఏఈవో లు మానస, యశస్విని, అంగన్వాడీ సూపర్వైజర్ కవిత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.