– జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావ్
నవతెలంగాణ-సూర్యాపేట కలెక్టరేట్
జిల్లాలో ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా వచ్చే వార్తలు, ప్రకటనలు ట్రాకింగ్ ద్వారా కట్టడికి పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఎం సి ఎం సి కమిటీ సమావేశంలో అదనపు యస్.పి. నాగేశ్వరరావు తో కలసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిబంధనల మేరకు దినపత్రికలు, వివిధ చానల్స్ లలో వచ్చే వార్తలు, ఆర్టికల్స్ లను నిరంతరం పరిశీలన చేసి సస్పెక్టెడ్ , పెయిడ్ న్యూస్, ఆర్టికల్స్ పై ఆయా నియోజక వర్గాల ఆర్.ఓ లకు క్రమ మార్గం ద్వారా తదుపరి చర్యలపై పంపించాలని అలాగే వ్యయ పరిశీలకులకు సమాచారం అందించాలని సూచించారు. కలెక్టరేట్ లో సోషల్ మీడియా ట్రాకింగ్ కేంద్రం ద్వారా ముందుగా అనుమతులు తీసుకోవాలని, సోషల్ మీడియా కట్టడి కి నోడల్ అధికారితో పాటు కమిటీ ని ఏర్పాటు చేయడం జరిగిందని వచ్చే వార్తలు, ఆర్టికల్స్ పై ట్రాకింగ్ సిస్టం ద్వారా గుర్తించి తదుపరి చర్యలు చేపట్టాలని సూచించారు. తదుపరి సస్పెక్టెడ్ ఐటమ్స్ పై కమిటీ తో సమీక్షించారు.ఈ కార్యక్రమంలో డి.పి.ఆర్.ఓ రమేష్ కుమార్, డి.ఈ మల్లేషం, కమిటీ సభ్యులు వీరా రెడ్డి, బి. కష్ణ, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.