వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి

నవతెలంగాణ-పరిగి
పరిగి పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన గణనాథులను నిమజ్జనం చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని పరిగి మున్సిపల్‌ చైర్మన్‌ ముకుంద అశోక్‌ కుమార్‌ అన్నారు. మంగళవారం పరిగి మండల పరిధిలోని లక్నాపూర్‌ దగ్గర ఏర్పాట్లను పరిగి మున్సిపల్‌ చైర్మన్‌ ముకుంద అశోక్‌ కుమార్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ నిర్వహించే వినాయక నిమజ్జన ఉత్సవానికి సంబంధించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలవకుండా ఏర్పాటు చేశామని అన్నారు. లక్నాపూర్‌ వెళ్లే రహదారిలో గుంతలన్నీ పూడ్చి మట్టి వేశామని అన్నారు. భారీ గణనాథులను నిమజ్జనం చేయడానికి ట్రైన్‌ కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో పరిగి మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసన్‌, కౌన్సిలర్లు వెంకటేష్‌, కిరణ్‌, మునీర్‌, రవి, నాయకులు ప్రవీణ్‌రెడ్డి, బల్లాల, మున్సిపల్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.