కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించిన

కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించిన– తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య
నవ తెలంగాణ మల్హర్ రావు
ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ మద్దతు ధరకు విక్రయించడానికి త్వరలో ప్రారంబించనున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయనున్న కల్లాలను శనివారం తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఇప్ప మొoడయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మండలంలో పిఏసిఎస్ ఆధ్వర్యంలో తాడిచెర్ల, మల్లారం,కొండంపేట,వళ్లెంకుంట,కొయ్యుర్, పెద్దతూoడ్ల తదితర గ్రామాల్లో సుమారుగా 12 కొనుగోలు కేంద్రాలను ప్రారబించడానికి ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందన్నారు.మండలంలో రైతులు 10 శాతం మాత్రమే పొలాలు కొస్తున్నట్లుగా, పూర్తిస్థాయిలో కొనుగోళ్లు ఊపందుకున్న తరువాత ప్రారంభిస్తామన్నారు.కొనుగోలు కేంద్రాల ప్రారంభాలకు రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు చేతులమీదుగా ప్రారంభం కానున్నట్టుగా తెలిపారు.