
కామారెడ్డి జిల్లా ఏఐటీయూసీ కార్యాలయంలో సివిల్ సప్లై అమాలి సంఘం ఏఐటియుసి అనుబంధ సంఘం కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించరు. ఈ సమావేశానికి సివిల్ సప్లై హమాలి జిల్లా అధ్యక్షులు పి బాలరాజ్ హాజరై మాట్లాడుతూ.. గతంలో సివిల్ సప్లై కార్మికులు ఆందోళన వల్ల 26 నుండి 29 రూపాయలకు ఎగుమతి, దిగుమతి రేట్లు పెంచడం జరిగిందని, వీటిని జనవరి నుండి అమలు చేస్తావని ప్రభుత్వం తెలియజేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ఏరియర్స్ కూడా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అట్లాగే జిల్లాలో నిరుపేదలకు రేషన్ బియ్యం అందిస్తున్న కార్మికులకు కనీస వసతులు కల్పించాలని, మహిళలకు పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, సొంత జిల్లాలో 7 గోదాములకు ఇప్పటివరకు సొంత గోధుము లేక కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అవుతుందని ఇప్పటికైనా సొంత గోదాములు నిర్మించాలని, సొంత గోదాములు ఉంటే కార్మికులకు పని ఉంటుందన్నారు. ప్రభుత్వం వెంటనే సివిల్ సప్లై హమాలను ఔట్సోర్సింగ్ కార్మికుల గుర్తించాలని సొంత గోదాం లేక అనేక ఇబ్బందులు పాల్పడుతున్నామని ఇప్పటికైనా అధికారులు సొంత గోదాం నిర్మించాలని ఏఐటీయూసీ సివిల్ సప్లై హమాలీ యూనియన్ గా డిమాండ్ చేస్తున్నా మాన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై జిల్లా కోశాధికారి బాల్రాజ్ ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎల్ దశరథ్, మైపాల్, సాయిలు, నాందేవ్, రాములు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.