
తమ న్యాయ బద్దమైన హక్కులను సాధించుకోవడానికి ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలుపుతున్న అంగన్వాడీ కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం అప్రజాస్వామికం అని తెలంగాణ రైతు సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు చల్లారపు తిరుపతి రెడ్డి అన్నారు. చిన్నకోడూరు మండల పరిధిలోని ఇబ్రహీంనగర్ గ్రామానికి చెందిన అంగన్వాడీలు ఆఫ్రినా, భాగ్యలక్ష్మిలను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. అరెస్టు చేయడం సిగ్గుచేటని, న్యాయ బద్దమైన అంగన్వాడిల డిమాండ్ లను నెరవేర్చే దిశగా యూనియన్లతో చర్చలు జరపకుండా, అర్థరాత్రి ఇళ్లలోకి పోయి మహిళలని చూడకుండా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం ఈ ప్రభుత్వం యొక్క అసమర్ధతకు నిదర్శనం అని అన్నారు.