టిపిసిసి ఇచ్చిన పిలుపు మేరకు కరీంనగర్ లోని ఎన్టీఆర్ బొమ్మ వద్ధ శనివారంసడక్ బంద్ రాస్తారోకో సందర్భంగా పోలీసులు అరెస్టు చేసి పొలీస్ సిటీ ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు. అరెస్టు అయిన వారిలో జమ్మికుంట పట్టణం నుండి జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కసుబోజుల వెంకన్న కాంగ్రెస్ నాయకులు చిన్నింటి నాగేంద్ర, కొత్తూరి సాగర్, లింగంపల్లి లింగారావు తదితరులుఉన్నారు.