సైబర్ నేరస్తుని అరెస్టు.!

Arrest of cyber criminal.– ఎవ్వరడిగిన ఓటిపి లు చేప్పోద్దు..
– సర్కిల్ ఇన్స్పెక్టర్ కె మల్లేష్…
నవతెలంగాణ – డిచ్ పల్లి
సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఒక వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు డిచ్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కె మల్లేష్ తెలిపారు. శనివారం సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. డిచ్ పల్లి సర్కిల్ పరిధిలోని ఇందల్ వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్టేషన్ తండా గ్రామ పంచాయతీ కి చెందిన బదవాత్ ఉపేంద్ర నాయక్ ను మంచిర్యాల జిల్లా శ్రీ రాంపూర్ కు చెందిన  నిందితుడు  తీగుట్ల మనోజ్ కుమార్  28 ఉపేంద్ర నాయక్ కు ఫో న్ చేసి మీ పేరు మీద బ్యాంక్ లో గోల్డ్ లోన్ వుందని ,వెంటనే అట్టి గోల్డ్ లోన్ ను క్లియర్ చేయక పోతే మీ గోల్డ్ మొత్తం సీజ్ చేస్తామని చెప్పి  భాదితుడిని నిర్మించినట్లు వివరించారు. టీ గుడ్ల మనోజ్ కుమార్ మాటలను నమ్మిన ఉపేంద్ర నాయక్ 25000 రూపాయలను ఫోన్ పే ద్వారా ట్రాన్స్ఫర్ చెయ్యించు కొని అతన్ని మోసం చేసినట్లు పేర్కొన్నారు. వెంటనే భదితుడు పోలీస్ స్టేషన్కు చేరుకొని జరిగిన విషయాన్ని వివరించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన  తరువాత  నిందితుడిని అరెస్టు చేసి కోర్టు లో హాజరు పరిచినట్లు తెలిపారు. సర్కిల్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ  పోలీసు పలు సూచనలు చేస్తున్నామని ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి మేము బ్యాంక్, ఇతరత్రా నుండి మాట్లాడుతున్నమని చెప్పి మీ సెల్ ఫోన్ కు ఓటిపి వచ్చిందని రకరకాలుగా మభ్య పెడతారని కానీ ఏది అడిగినా చెప్పవద్దని, అలాంటి మోసగాళ్లకు ఎటువంటి డబ్బులు పంపించవద్దని, ఎటువంటి సైబర్ నేరాలు జరిగిన 1 930కి కాల్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు సీఐ కే మల్లేష్, ఇందల్ వాయి ఎస్ హెచ్ ఓ మనోజ్ కుమార్  కోరారు.