మాజీ సర్పంచుల అరెస్ట్ 

Arrest of ex-serpentsనవతెలంగాణ – రామారెడ్డి 

పెండుకు గ్రామపంచాయతీ బిల్లులు, గ్రామ అభివృద్ధిలో భాగంగా కాంట్రాక్ట్ చేసిన బిల్లులు విడుదల చేయక మాజీ సర్పంచులు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మాజీ సర్పంచుల ఫోరం జేఏసీ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు హైదరాబాద్ తరలి వెళ్తారనే  సమాచారంతో ఉప్పల్వాయి మాజీ సర్పంచ్ కొత్తొల్ల గంగారం, రామారెడ్డి మాజీ సర్పంచ్ దండబోయిన సంజీవ్, గిద్ద మాజీ సర్పంచ్ రామ్ రెడ్డి లను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ క తరలించారు.