
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ఢిల్లీ ముఖ్యమంత్రి క్రేజీవాల్ ను అరెస్టు చేయడం ఆ ప్రజాస్వామికమని ఆమ్ ఆద్మీ పార్టీ సూర్యాపేట జిల్లా అధికార ప్రతినిధి దుంపల మురళీధర్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2021 22 ఎక్సైజ్ పాలసీని రూపొందించి అమలు చేయడంలో ఢిల్లీ ప్రభుత్వం అవినీతి మనీ లాండరింగ్ పాల్పడిందని ఆరోపణల పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దేశంలోని ఒక ముఖ్యమంత్రిని కోర్టులో చార్జ్ షీట్ కూడా సమర్పించకుండా అరెస్ట్ చేయడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం అని అన్నారు. గతంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ రాంచీ నగరంలో తనకు చెందిన భూమికి సంబంధించిన కేసులో బలవంతంగా రాజీనామా చేయించిన తర్వాత మాత్రమే అరెస్టు చేశారని గుర్తు చేశారు. బిజెపి ప్రభుత్వం ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులపై లెక్కలేనని కేసులు మోపి అరెస్టు చేస్తుందని ఖండించారు. దేశంలో బిజెపి వ్యతిరేక ధోరణి బలపడుతుండగా ఇండియా కూటమి తమ విభేదాలను పక్కన పెట్టి బలపడుతున్నందున, ఎన్నికల లో బీజేపీ ఓడిపోతుందనే ఉద్దేశంతోనే అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు.అక్రమ దాడులకు వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్ష పార్టీలతో కలిసి ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో అమ్ ఆద్మీ పార్టీ నాయకులు దుంపల పారిజాత, చల్లా సాలయ్య, వై సోమలక్ష్మి, వై యాకూబ్ రెడ్డి బెజ్జంకి నరసింహ చారి, సావిత్రమ్మ గంటా సందీప్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.